Saturday, February 27, 2010

 
                           హలో నా కొత్త బ్లాగు కి సుస్వా గతం

నా పేరు వెంకటేష్ మాది కడప జిల్లా లోని పెనగలూరు మండలం లో ఈటిమార్పురం అనే ఒక చిన్న గ్రామం .మా ఊరిలో 400 కు పైగా ఇల్లుంటాయి .అందులో అన్ని కులాలకు చెందిన వారున్నారు .మా ఊరంతా పచ్చని మామిడి చెట్లతో కనులకింపుగా మనసుకు ఆహ్లాదాన్ని కల్గిస్తూ స్వచ్చమైన గాలితో మల్లీ మల్లీ చూడాలని పించే ప్రకృతి సోయగాలతో కోయిల కుహూ కుహూ రాగాలతో ఎల్లప్పుడూ ఒకే ప్రేమను పంచే అమ్మలా లాలిస్తున్నట్టుంటుంది .ఊరికి ఒక వైపున పెన్నానది కి ఉపనది ఐనటువంటి గుంజనేరు ప్రవహిస్తుంటే దానిపైన ఇరవై మీటర్లు పొడవునా కట్టిన బ్రిడ్జి ఆ నదికే అందాన్ని తెస్తుంది .ఊరికి ఉత్తరాన సింగనమల దక్షిణాన చక్రంపేట తూర్పున నాయుడువారిపల్లి పడమర తూర్పుపల్లి సరిహద్దులుగా ఉన్నాయి.ఈతిమార్పురం పంచాయితీ లో మూడు గ్రామాలు ఉన్నాయి .ఊరిలో రెండు రామాలయాలు కొండ మీద వెలసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి ,ఊరి గ్రామదేవత రేణుకా ఎల్లమ్మ ,దేవాలయాలు ఉన్నాయి .ప్రతి ఏట మే నెలలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి .చుట్టు ప్రక్కల గ్రామాలనుండి వేలమంది ప్రజలు ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి ఇక్కడికి చేరుకుంటారు....

1 comment:

Unknown said...

HI Venkulu...... UR Blog Nice....Yarr....... Really it's True......or...........